#తెలంగాణ #హైదరాబాద్

కాంగ్రెస్ గూటికి గులాబినేతలు…

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్):Sampath Panja

టిపిసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేపాక మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి.

[embedyt] https://www.youtube.com/watch?v=m4K-xa3s8NI[/embedyt]

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామ మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి టి పి సి సి అద్యక్షుడు రేవంత్ రెడ్డి నివాస గృహం లో మానకొండూరు కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

భూపతి రెడ్డి తో పాటు ఇల్లంతకుంట సింగిల్ విండో చైర్మన్ భుంపల్లి రాఘవ రెడ్డి,బి ఆర్ ఎస్ రాష్ట్ర కిసాన్ సెల్ నాయకులు పాశం రాజేందర్ రెడ్డి,ప్రముఖ ఎన్ ఆర్ ఐ అన్నడి మహేందర్ రెడ్డి,బీజేపి మండల ప్రధాన కార్యదర్శి బద్దం ఎల్లారెడ్డి,పెద్ద లింగాపుర్ బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అద్యక్షులు కేతిరెడ్డి వెంకట్ రెడ్డి, మాతి రెడ్డి రవీందర్ రెడ్డి,తూర్పు కిషన్ రెడ్డి, అన్నాడి సంపత్ రెడ్డి , సింగిరెడ్డి అభినయ్ రెడ్డితో పాటు 200 మంది బి ఆర్ ఎస్,బీజేపి పార్టీ ల నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో రేపాక గ్రామ శాఖ అద్యక్షులు దయ సాగర్ లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *