గోదావరి హారతి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
గోదావరి హారతి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
రాయికల్
ఈ నెల 3జూన్ నుండి 8 జూన్ తారీకు వరకు నిర్వహించే గోదావరి హారతి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణను గురువారం రాయికల్ పట్టణంలో నిర్వహించారు ..
బిజెపి జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్చార్జి గోదావరి హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్ బోలుసాని మురళీధర్ రావు గత 11 సంవత్సరాల క్రితం గోదావరి కలుషితమైతున్న తరుణంలో గోదావరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది…
ఈ నేపథ్యంలో తలపెట్టిన గోదావరి ఉత్సవసమితి ఆధ్వర్యంలో గోదావరి మహా హారతి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు..
2023 గోదావరి హారతి కార్యక్రమంలో భాగంగా ఈనెల 3న కందకుర్తి గోదావరి హారతితో మొదలై ఎనిమిదో తారీకు భద్రాచలం గోదావరి హారతి కార్యక్రమంతో ముగుస్తుంది. ఈ గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రతి హిందువు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో గోదావరి హారతి జిల్లా యాత్ర ప్రముఖ్ నరేంద్ర పన్నీరు, జిల్లా కన్వీనర్ పిల్లి శ్రీనివాస్, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు సురతాని భాగ్యలక్ష్మి, బీజేపీ మండల అధ్యక్షుడు అన్నవెని వేణు,జిల్లా కార్యవర్గ సభ్యుడు కురుమ నారాయణ రెడ్డి, పట్టణ నాయకులు మచ్చ నారాయణ, ఓబిసి మోర్చ అధ్యక్షుడు తోపరపు ఆశాలు, ఉట్నురి రవీందర్, కట్ట నవీన్ మండల ప్రధాన కార్యదర్శి తిప్పి రెడ్డి శేఖర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు కుణారపు బుమేష్, కార్యదర్శి సామల సతీష్, దలిత మోర్చ అధ్యక్షుడు బన్న సంజీవ్, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.