గ్రామపంచాయతీ కార్మికుల ఆందోళన-వంటా వార్పు
రాజన్న సిరిసిల్ల జిల్లా:
ఎల్లారెడ్డిపేట మండలంలో గత పది రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు వేతనాలు పెంచాలని కార్మికులను పర్మినెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మె చేస్తున్నారు.
శనివారం రోజు వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన హక్కులను తీర్చినట్లైతే ఉద్యమం చేస్తామని శనివారం సంఘీభావం తెలిపిన సిపిఎం నాయకులు హెచ్చరించారు.