# Tags
#Blog

జగిత్యాల జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం

జగిత్యాల :

• అధ్యక్షులుగా కందుకూరి రవిబాబు, ప్రధాన కార్యదర్శిగా మామిడి రమేష్, అసోసియేటెడ్ అధ్యక్షులుగా అరిగెల అశోక్

జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఎన్నికల అధికారి తూము రవీందర్ మరియు మాజీ టీజీవో జగిత్యాల అధ్యక్షులు గంగుల సంతోష్ కుమార్ సమక్షంలో…టి జి ఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.

ఈ ఎన్నికలలో జగిత్యాల జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులుగా కందుకూరి రవిబాబు, ప్రధాన కార్యదర్శిగా మామిడి రమేష్, అసోసియేటెడ్ అధ్యక్షులుగా అరిగెల అశోక్, కోశాధికారిగా గణేష్ తోపాటు మొత్తం 20 మందితో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.ఈ సందర్భంగా టి జి ఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘం తరఫున ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మరియు రాష్ట్ర నాయకులు శ్యామ్ ఉపేందర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజీవో సంఘం ఏర్పడిన నుండి ఉద్యోగుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నామని అన్నారు. ఉద్యోగులకు రావలసిన అన్ని సదుపాయాలు రావాలని మరియు పెండింగ్లో ఉన్న బిల్లులు, మెడికల్ బిల్లులు, పదవి విరమణ పొందిన వారి పెన్షన్ బిల్లులు అన్నీ కూడా సత్వరమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు.ఉద్యోగుల హక్కులను కాపాడుట కొరకు రాష్ట్రంలోని 200 పైబడిన సంఘాలతో టి జేఏసీ ఏర్పాటు చేయడమైనదని, సమస్యల సాధనకు పోరాడుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *