జిల్లాలోని హిమ్మత్ రావుపేట గ్రామానికి ఉత్తమ గ్రామపంచాయతీగా ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రదానం
జిల్లాలోని హిమ్మత్ రావుపేట గ్రామానికి హైదరాబాద్ లో ఉత్తమ గ్రామపంచాయతీగా ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రదానం
-మంత్రి దయాకర్ రావు , సిఎస్ శాంతికుమారి అభినందనలు

హైదరాబాద్ …..
జగిత్యాల జిల్లాలోని హిమ్మత్ రావుపేట గ్రామపంచాయతీకి ఐఎస్ ఓ సర్టిఫికేట్ ప్రశంసాపత్రంను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎరవెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి చేతులమీదుగా సర్పంచి పునుగోటి కృష్ణారావు అందుకున్నారు.
ఇటీవల స్వఛ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో జిల్లా స్థాయితో పాటుగా రాష్ట్ర స్థాయిలో హిమ్మత్ రావుపేట గ్రామపంచాయతీకి అవార్డులు లభించాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందిన గ్రామపంచాయతీల సర్పంచి లకు గురువారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ మంత్రిప్రగడ హనుమంతరావు తదితర అధికారులు హైదరాబాద్ రవీంద్రభారతిలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా నుంచి జిల్లా స్థాయిలో ఇటీవల ఎంపికైన 27 గ్రామపంచాయతీల సర్పంచ్ లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ తో పాటుగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కుందారపు లక్ష్మినారాయణ, జడ్పీ సిఈఓ రామానుజాచార్యులు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, తదితర అధికారుల ఆధ్వర్యంలో హైదరాబాద్ తరలివెళ్లారు.
ఈ సందర్భంలో గురువారం రాత్రి రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా హిమ్మత్ రావుపేట గ్రామపంచాయతీ సర్పంచి పునుగోటి కృష్ణారావుతో పాటు రాష్ట్రంలోని 28 గ్రామపంచాయతీలకు ఐఎస్ ఓ సర్టిఫికేట్ ప్రదానం చేసి అభినందించారు.