# Tags
#తెలంగాణ #politics #జగిత్యాల

జిల్లాలో పదవతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

జగిత్యాల :

బుధవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాధికారి,చీఫ్ సూపర్డింట్ వెహికల్ ఇంచార్జ్, సిట్టింగ్ స్వాడ్, ప్రిన్సిపల్ లతో జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో మొత్తం 67,పరీక్ష కేంద్రాలలో 11,865 మంది విద్యార్థులు బ్యాక్ లాగ్ విద్యార్థులు 285 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

పదవ తరగతి పరీక్షలు మార్చి 21,వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయని అన్నారు.అన్ని పరీక్షలను ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

 పరీక్ష, జవాబు పత్రాల తరలింపు సమయంలో తగిన  జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద తగిన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. సీసీ టీవీ కెమెరాల నిఘాలో పరీక్షలను జరుగుతాయని అన్నారు.

పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్స్ స్మార్ట్ వాచ్లు అనుమతి లేదని అన్నారు.

ఎటువంటి మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల దగ్గర పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు ఉంటుందని పరీక్ష జరుగుతున్నంతసేపు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.

పరీక్ష కేంద్రాల వద్ద పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు.

 ప్రతి పరీక్ష కేంద్రంలో త్రాగునీరు టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని.అన్ని పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు.

జిల్లాలో పదవతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

test