# Tags
#Blog

జెడ్పిహెచ్ఎస్ ధరూర్ క్యాంప్ పాఠశాలలో

జగిత్యాల :

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం జెడ్పిహెచ్ఎస్ ధరూర్ క్యాంప్ పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమానికి ఎన్ సీ డీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ అర్చన, సైకియాట్రిస్ట్ డాక్టర్ డింపుల్ హాజరై, విద్యార్థులు అందరూ ఒత్తిడి లేకుండా చదువుకోవాలని మానసికంగా సంసిద్ధంగా ఉండాలని, చెడు అలవాట్లు దరికి చేరకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీదేవి, శ్రీలత, గంగయ్య, షబానా, పవన్, ప్రభాకర్, షకీల్, ప్రవీణ్, అనూజ, మనోహర్, కిరణ్ పాల్గొన్నారు.