# Tags
#తెలంగాణ

తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

(తెలంగాణ రిపోర్టర్)రాజన్న సిరిసిల్ల..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ పరిసరాలు,స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో స్వాదీనం చేసుకున్న వాహనాల వివరాలు,స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న,నమోదైన కేసుల వివారలు, స్టేషన్ రికార్డ్ లు పరిశీలించి, పెండింగ్ కేసులపై అరా తీసి త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
నమోదు అయిన కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని,ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందిస్తూ ,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.

నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేసారు. పోలీసు స్టేషన్ లో అన్ని రకాల విధులను సక్రమంగా నేర్చుకోవాలన్నారు. రికార్డ్ నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షను, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు మొదలుగు విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలన్నారు.

పోలీస్ స్టేషన్లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకొని,బ్లూ కోల్ట్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను తనిఖీ చేయాలని,స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.

విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు,విలేజ్ పోలీస్ అధికారులు తరచు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతు ప్రజలకు చట్టాల మీద, డయల్100,షీ టీమ్స్, సైబర్ నేరాలు,ట్రాఫిక్ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని అన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.

ఎస్పీ వెంట సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ మొగిలి, ఎస్.ఐ రామ్మోహన్ సిబ్బంది ఉన్నారు.