తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేనా?
అసలు వివరాలు…..
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రిజర్వేషన్లు:
SCs – 15%
STs – 10%
BCs – 25% (A, B, C, D, E గ్రూపులకు కలిపి)
మొత్తం రిజర్వేషన్ల శాతం 50%
ఇప్పుడు 25 శాతం నుండి బీసీలకు 42% రిజర్వేషన్ పెంచితే మొత్తం రిజర్వేషన్ 67% కి పెరుగుతుంది
అలా పెరగడం వాళ్ళ జనరల్ కేటగిరి తగ్గిపోతుంది మెజార్టీ పెద్ద కులాలు సామాజిక వర్గాల రాజకీయ నాయకులకు పరిది తగ్గుతుంది అన్నమాట.
మరి తమిళనాడు లో రిజర్వేషన్ల శాతం 69% ఎందుకు ఉన్నాయి అంటే, ఇది అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్ పెట్టీ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్‌లో చేర్చడం వల్ల అమలవుతోంది., అలా రాజ్యాంగంలో వున్న ఆర్టికల్ ముట్టుకునే హక్కు కోర్టుకు లేదు.
మన ముఖ్యమంత్రి మాదిరిగానే మహారాష్ట్ర (Maratha quota), రాజస్థాన్, మధ్యప్రదేశ్: 50% పైగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నించి ఎన్నికలు నిర్వహించారు వాటిని కోర్టులు అడ్డుకున్నాయి
తెలంగాణ ప్రభుత్వం సమర్థమైన డేటా & బీసీ జనాభా గణాంకాలను సేకరించి, కేంద్రాన్ని ఒప్పించాల్సి ఉంటుంది.
50% పైగా రిజర్వేషన్ అమలు చేయాలంటే ,కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, రాజ్యాంగ సవరణ (9వ షెడ్యూల్‌లో చేర్పించడం) కోసం ప్రయత్నించడం తప్ప వేరే ఆప్షన్ లేదు మన ప్రభుత్వానికి లేదా ఇతర ప్రభుత్వాలకు (తమిళనాడు మాదిరిగా).
-నిన్న హై కోర్టులో ప్రభుత్వ తరుపు న్యాయవాదిని కులగణన వివరాలు అడిగితే మాదగ్గర ఉన్నాయి అన్నారు కానీ కోర్టుకు ఇవ్వలేదు
ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ GO-9 కోర్టు కొట్టివేయకూడదు అంటే
-బీసీ జనాభా గణాంకాలను సమగ్రంగా సేకరించి, ప్రత్యేక నివేదిక కోర్టుకు సమర్పించడం వాదించడం అప్పటికి ఒప్పుకుంది అనే నమ్మకం కూడా ఉండదు
-ప్రస్తుత నిబంధనల ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం నేరుగా సాధ్యం కాదు అయినా ముఖ్యమంత్రి ముందుకు పోతున్నారు అంటే సాహసమనే చెప్పాలి..
-అయినా ముఖ్యమంత్రి మొండి పట్టుదలతో స్థానిక సంస్థల ఎన్నికలు 42%రిజర్వేషన్ నిర్వహిస్తే
రేపు కోర్టు జీవో కొట్టేసి ఎన్నిక చెల్లదంటే డబ్బులు పెట్టీ ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఇబ్బంది పడక తప్పదు..
ACN Channel News, జగిత్యాల
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





