# Tags
#Blog

తెలంగాణ అమరులకు ఘనంగా నివాళులర్పించడం మనందరి బాధ్యత :జిల్లా కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జాతీయ పతాకావిష్కరణ గావించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో ఆదివారం ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా తో పాటు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించడం మనందరి బాధ్యత అన్నారు.

ఎందరో అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 10 ఏళ్లు దాటిన సందర్భంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం, అమరులకు నివాళులర్పించడంతో పాటుగా  రాష్ట్ర ప్రగతిని, చరిత్రను చాటిచెప్పడానికి చేసుకుంటున్న కార్యక్రమమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని వివరించారు. ఉద్యమంలో పాలు పంచుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులతో పాటు అన్ని వర్గాల వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.

అలాగే సంక్షేమ పథకాల అమలు దిశగా నిరంతరం కృషి చేస్తున్న ఉద్యోగులకు, తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను చాటి చెపుతున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని కలెక్టర్ అన్నారు.