# Tags
#తెలంగాణ #హైదరాబాద్

ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్యులు కందుల దుర్గేష్‌, సత్యప్రసాద్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కార్యక్రమ ప్రారంభంలో రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కాళోజీ నారాయణరావు రాసిన “నా గొడవ” పుస్తకాన్ని బహుకరించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటుగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు పుష్పగుఛ్ఛములందించి స్వాగతం పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *