#తెలంగాణ #వ్యవసాయం #హైదరాబాద్

భారీ వర్షాలున్న జిల్లాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌

భారీ వర్షాలున్న జిల్లాల్లో అప్రమత్తం…
కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌

హైదరాబాద్‌: Ch.PrashanthSharma

భారీ వర్షాలు కురుస్తున్నందున భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు.

మంగళవారం రాత్రి ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ”రాష్ట్రంలోని పలు జిల్లాలకు అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్‌, రెడ్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఆయా కలెక్టరేట్లు, మండలాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి” అని సీఎస్‌ ఆదేశించారు.

కాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంతాలు, బలహీన కాజ్‌వేలు, వంతెనలను గుర్తించినట్లు విపత్తు నివారణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా తెలిపారు. అగ్నిమాపక శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల కార్యాలయాల్లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ డీజీ నాగిరెడ్డి చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *