# Tags
#Blog

మంథనిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మంథని :

రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు పోలీస్ స్టేషన్ సమీపంలోని కాంగ్రెస్ ఆవిర్భావ జెండా వద్ద జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెంబర్ శశిభూషణ్ కాచే, మంథని మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ప్రచార కమిటీ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాంట్ల సంతోషిని, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, మాజీ ఎంపీపీ కొండా శంకర్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు

మాట్లాడుతూ…

మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామని నాయకులు అన్నారు.

👉 కాంగ్రెస్ పార్టీ ప్రయాణం కేవలం రాజకీయ చరిత్ర కాదు. అది త్యాగం నుంచి స్వప్నం వరకు, ఉద్యమం నుంచి పరిపాలన వరకు సాగిన భారత ప్రజాస్వామ్య గాథ.నిన్నటి పోరాటం, నేటి ఆలోచన, రేపటి ఆశ..ఈ మూడింటి మధ్య వంతెనగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది.

👉 మొన్నటి రోజున జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటి అభ్యర్థులను భారీ ఎత్తున గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసం ఎల్లప్పుడు ముందుండి కొట్లాడే పార్టీ అని తెలియజేశారు.

👉 గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేసింది. యూపీఏ పాలనతోనే సమాచార హక్కు చట్టం (RTI–2005) పౌరులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కల్పించింది. విద్యాహక్కు చట్టం (RTE–2009) 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, తప్పనిసరి విద్యను మౌలిక హక్కుగా మార్చింది. ఆహార భద్రత చట్టం (NFSA–2013) పేదలకు తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు లభించేలా చేసి, కోట్లాది కుటుంబాలకు ఆహార భరోసాను కల్పించింది. అటవీ హక్కుల చట్టం (2006) అడవుల్లో నివసించే గిరిజనులకు భూమిపై, వనరులపై హక్కులు కల్పించింది. భూమి సేకరణ చట్టం (2013)– భూమి సేకరణలో రైతులకు న్యాయమైన పరిహారాన్ని తప్పనిసరి చేసింది.

👉 ఇందుకు భిన్నంగా గత 12 ఏళ్లు కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలైన ఎయిర్‌పోర్టులు, పోర్టులు, బొగ్గు గనులు, జాతీయ రహదారులను ప్రైవేటు పరం చేస్తున్నది.

👉 ఉపాధి హామీ చట్టంలో మహాత్మాగాంధీ పేరు తొలగించి ‘జీ–రామ్ జీ’ అని పేరును, ఆ చట్టంలో నిబంధనలు మార్చి, ఆ చట్టాన్ని దాదాపు నిర్వీర్యం చేసింది. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నది. మరోపక్క రూపాయి మారకం విలువ రోజురోజుకు పడిపోతున్నది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దేశంలో మతం పేరుతో నిత్య దాడులు పెట్రేగిపోతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా నిర్మించలేదు. కాంగ్రెస్‌ హయాంలో ఎన్నో ఐఐటీ, ఐఐఎం వంటి అత్యున్నత విద్యా సంస్థలు మేధో వనరులను సృష్టించి దేశాన్ని విజ్ఞాన ఆధారిత దేశంగా తీర్చిదిద్దాయి. కానీ బీజేపీ హయాంలో ఎన్ని కేంద్రీయ విద్యా సంస్థలు, ఎన్ని విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యాయో లెక్క చూస్తే నిరాశ కలుగుతుంది. ఇలాంటి పనులు గాలికి వదిలి, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసి, ప్రభుత్వాలను కూలగొట్టే పని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఓట్ చోరీతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.

👉 కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చాయి. మళ్ళీ మా నాయకుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. అందుకు తెలంగాణ నుంచి బీజం పడింది. రాష్ట్రంలోని ప్రజాపాలన దేశానికే ఆదర్శంగా నడుస్తున్నది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మళ్ళీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టి ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరుస్తుంది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచ్లు,వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.