మణిపూర్ దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి …జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామని వనిత
మణిపూర్ దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి …జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామని వనిత….
రాజన్న సిరిసిల్ల(తెలంగాణ రిపోర్టర్, Sampath Panja)
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటనపై దేశవ్యాప్తంగా విమర్శల వర్షం కురుస్తుందని, ఈ అంశం పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి అని కాముని వనిత ప్రశ్నించారు.
ఈ సంఘటన చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటనపై దేశవ్యాప్తంగా విమర్శల వర్షం కురుస్తుందని,దళిత సంఘాలు మహిళా సంఘాలు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందరూ చూస్తుండగా ఊరేగించడం చుట్టుపక్కల వారు చూస్తూ ఉండడం చాలా సిగ్గుచేటు. ఈ సంఘటన జరిగితే ఏ ఒక్కరు కూడా ముందుకు రాకుండా ఉత్సావ విగ్రహాలు లాగా చూస్తూ ఉండడం చాలా బాధాకరం అన్నారు.
ఈ ఘటన మన సమాజానికి మచ్చ దేశంలో మహిళల గౌరవానికి భద్రత ఎక్కడిదని, రెండు నెలలుగా మణిపూర్లో జరుగుతున్న సంఘటనకు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని అన్నారు.
మణిపూర్ లో మహిళలపై జరిగిన దారుణమైన సంఘటన ను సిగ్గుతో అవమానంతో పరువుతో తీవ్ర నిరాశతో తలదించుకోవాలని అన్నారు…మణిపూర్లో ఆదివాసి మహిళలకు వెంటనే న్యాయం చేయాలని, పోకిరిలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించడం సిగ్గు చేటు అని అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..