# Tags
#Blog

రాజకీయంగా ఓనమాలు నేర్పింది నా వార్డు ప్రజలు, జగిత్యాల మున్సిపాలిటీ

జగిత్యాల :

కరోనా లాంటి క్లిష్ట సమయంలో జగిత్యాల ప్రజలకు సేవ చేసే అవకాశం దొరకడం నా అదృష్టం : డా.బోగ శ్రావణిప్రవీణ్,

  • నా హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు సంతృప్తి ఇచ్చాయి
  • 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న గౌరవ కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు
  • 3 సంవత్సరాలు నాకు సహకరించిన జగిత్యాల ప్రజలు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు : డా.బోగ శ్రావణిప్రవీణ్,
    మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

సరిగ్గా 5సంవత్సరాల క్రితం ఒక సాధారణ వైద్యురాలిగా వున్న నన్ను, అపుడు జరిగిన మున్సిపల్ సాధారణ ఎన్నికలో రాజ్యాంగ రచయిత BR అంబెడ్కర్ ఇచ్చిన అవకాశం బీసీ మహిళకు జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ గా నాకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అవకాశం.

ఆ సమయంలో నాకు సహకరించిన నా 37వ వార్డ్ ప్రజలు , జగిత్యాల్ ప్రజలు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మరియు నా కుటుంబసభ్యులు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.

నా రాజకీయ జీవితంలో నాకు రాజకీయ ఓనమాలు నేర్పింది నా 37వ వార్డ్ ప్రజలు మరియు జగిత్యాల మున్సిపాలిటీ.నేను మొదటిగా ఛైర్పర్సన్ గా పదవి అధిరోహించిన రెండు నెలల లోపు కరోనా లాంటి విపత్తు ప్రపంచాన్ని కుదుపువేసింది. ఆ సమయంలో నా జగిత్యాల పట్టణం మరియు ప్రజలను కాపాడుకోవలసిన బాధ్యతతో రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా పట్టణం మొత్తం రెండు సార్లు ప్రతి వీధి హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటేషన్ చేపించే అవకాశం లభించింది.

కరోనా సమయంలో జగిత్యాల పట్టణంలో చెత్త సేకరణ కోసం పెద్ద ఎత్తున్న ఆటోలు, ట్రక్ లు, ట్రాక్టర్లు, స్వీపింగ్ మెషిన్ కొనుగోలు చేయడం, ప్రతి ఇంటికి తడి-పొడి చెత్త డబ్బాలు ఇవ్వడం జరిగింది.

పట్టణంకి కేవలం టవర్ సర్కిల్ లో ఒక్కటే కూరగాయల మార్కెట్ వుండేది, మేము వచ్చాక రైతు బజార్, అంగడి బజార్ లలో కూడా కూరగాయల విక్రయకేంద్రాలు ఏర్పాటు (పునరుద్దరణ) చేయడం జరిగింది. మరియు బీట్ బజార్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కి శంకుస్థాపన చేయడం జరిగింది.

జగిత్యాల పట్టణంలోని ముఖ్య కూడళ్లు కొత్త బస్టాండ్ మరియు పాత బస్టాండ్ ఆధునీకరించడంతో పాటుగా, పట్టణానికి కేవలం ఒకటే పార్కు ఉండేది.. మా హయాంలో టీఆర్ నగర్ లో ప్రకృతి వనం ఏర్పాటు చేయడం, కరీంనగర్ రోడ్ లో గల అమరవీరుల స్థూపం మరియు పార్కు అభివృద్ధి చేయడం, 9వ వార్డ్ లో టీచర్స్ భవన్ దగర పార్క్ అభివృద్ధి ,అంతర్గం చెరువు దగ్గర బతుకమ్మ ఘాట్ మరియు పార్క్ అభివృద్ధి చేయడం జరిగింది మరియు రోటరీ పార్క్ ఆధునీకరించడం జరిగింది.

జగిత్యాల పట్టణంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటడం జరిగింది. అలాగే, పట్టణ ప్రజల ఆరోగ్యం కొరకు పార్కులలో, క్రీడా మైదానంలలో ఓపెన్ జిమ్ లను ప్రారంభించడం మరియు ప్రజారవాణా అధికంగా వున్న ప్రదేశాలలో మరుగుదొడ్లను ప్రారంభించడం జరిగింది.

వరదల సమయంలో జగిత్యాల పట్టణంలోని ముంపు ప్రాంతాలలో పర్యటించి ప్రజలను సురక్షితం గా పునరావాస కేంద్రాలకు తరలించడం, అక్కడ వారికీ కావాల్సిన సదుపాయాలు ఏర్పరచడం జరిగింది.
మోతె చెరువు, ఫిల్టర్ బెడ్, చింతకుంట మరియు కండ్లపెల్లి చెరువు కట్టలను పురుద్దరించడం మరియు బతుకమ్మ ఘాట్ లు నిర్మించడం జరిగింది.

పట్టణంలో 48 వార్డులలో సీసీ రోడ్ లు మరియు మురుగు కాలువలకు కావాల్సిన నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరిగింది, ఎప్పుడు రద్దీగా వుండే బైపాస్ రోడ్డు అధ్వాన స్థితిలో వుండే వాటికీ ప్రత్యేకంగా నిధులు కేటాయించి పునరుద్ధరించడం జరిగింది.

ప్రతి మనిషి చివరి మజిలీ అయినటువంటి వైకుంఠధామాలను ఆధునీకరించి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చింతకుంట, శంకరఘాట్ , గొల్లపెల్లి రోడ్డు స్మశానవాటికలు ఆదినాకరించడం మరియు జగిత్యాల ప్రజలకు ఉచితంగా వైకుంఠ రధం ని ఏర్పర్చడం జరిగింది.

యావర్ రోడ్డు లో సెంట్రల్ లైటింగ్, పార్క్ ఎదురుగా సెంట్రల్ డివైడర్, వివిధ వార్డులలో కరెంటు స్థంబాలు మరియు ముఖ్యకూడల్లో హైమాస్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది.

నా మూడు సంవత్సరాల మున్సిపల్ ప్రయాణంలో నాకు పార్టీలకు అతీతంగా సహకరించి నాకు వెనంటి వుంన్న గౌరవ కౌన్సిల్ సబ్యులకు, వివిధ శాఖలకు చెందిన జిల్లా మరియు మున్సిపల్ అధికారులకు, నేను చేసిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి గడపకు చేర్చినటువంటి నా జర్నలిస్ట్ సోదరులకు మరియు కార్మికులకు నా కృత్యగ్యతలు మరీముఖ్యంగా నను ఆదరించి ఆశీర్వదించిన నా ప్రజలకు శేతకోటి వందనాలు.
మీ అందరి ఆశీర్వాదంవలన మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలో గౌరవప్రద ఓట్లను సాధించడం జరిగింది, మున్ముందు మీ సహాయసహకరాలతో ఆశీర్వాదంతో జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు సేవచేసుకునే అవకాశం కల్పించాలి అని కోరుతూ
మీ డా.భోగ.శ్రావణి….