# Tags
#Blog

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని టీటీడీ ఛైర్మన్ ను కోరిన కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో భూమి పూజ చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గారిని టిటిడి పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారితో కలిసి ఇవాళ తిరుమలలో కోరడం జరిగింది.

దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని గతంలోనూ కోరినట్లు గుర్తు చేయడం జరిగింది. కావున శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని, వారి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరాడమైంది.

అలాగే హుజురాబాద్ నియోజకవర్గంలోని పురాతన ఇల్లందకుంట రామాలయం మరియు కొండగట్టు అంజనేయ స్వామి ఆలయాల ఘన చరిత్రను వివరించడంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో ఆయా దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని కోరడమైంది.

దీనిపై స్పందించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గారు తగు నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా స్పందించడం జరిగింది.

ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ గారు, తిరుపతి బిజెపి మరియు జనసేన జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారు, హరి ప్రసాద్ గారు పాల్గొన్నారు.