సమాజానికి ఆయువు పట్టు, నవసమాజ నిర్మాతలు ఉపాధ్యాయులే : జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత
జగిత్యాల
సమాజానికి ఆయువు పట్టు, నవసమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ విద్యా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 27వేల పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, వందల సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
[embedyt] https://www.youtube.com/watch?v=bnLg-nNxoqE[/embedyt]నైతిక విలువలతో కూడిన విద్యాబోధన అందించాలని అన్నారు. పేద పిల్లల చదువు మధ్యలో ఆగకుండా ఉండేందుకు సంక్షేమ శాఖలలో వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవం నిర్వహించుకున్నామని, మన ఊరు – మన బడి క్రింద రు. 116 కోట్లతో 274 పాఠశాలల్లో మొదటి దశలో పనులు చేపట్టి పూర్తి చేసుకున్నామని తెలిపారు.
ఉచిత పుస్తకాలు, నోటు బుక్కులు, యూనిఫాం లు అందించడం జరుగుతున్నదని తెలిపారు. ఆరోగ్య వంతమైన భోజనం అందించామని, నేటి నుండి రాగి జావ అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల చదువు పట్ల పోషకులు కూడా శ్రద్ద కనబరచాలని అన్నారు.
పదవ తరగతిలో 10/10 సాధించిన విద్యార్థులకు, సంబంధిత ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు.
శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కువ విద్యాలయాలు, గురుకులాలు ఎర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వం దే ననై అన్నారు. సాధించిన ఘనత ప్రజలకు వివరించేందుకు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటు న్నామని ఆయన వివరించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మంద మకరంద మాట్లాడుతూ, విద్యార్థులకు అర్థం అయ్యేవిధంగా బోధించడానికి శిక్షణ ప్రభుత్వం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఒ జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోషకులు, తదితరులు పాల్గొన్నారు. TLM లో ఉత్తమ ప్రతిభ కనబరచిన 10 మంది టీచర్ లను సన్మానించారు. అనంతరం రాగి జావ పంపిణీ చేశారు.
అంతకు ముందు ప్రభుత్వ పాఠశాలల బాలికల విద్యార్థినిలచే తెలంగాణ గీతం, కేజీబివి రాయికల్ లో పదవ తరగతి చదువుతున్న విదూష చేసిన ఝాన్సీ రాణి ఏకపాత్రాభినయం, పి.ఎస్. తొంబ రావుపెట విద్యార్థులచే ముఖ్య పట్టణాలు, రాష్ట్రాల పేర్లు, ప్రాథమిక పాఠశాల కోరుట్ల విద్యార్థులచే అబాకస్ గణిత సంకలనము కార్యక్రమాలు నిర్వహించారు. 143 బోధనోపకరణ ప్రదర్శనలను సందర్శించారు.
పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 27 మంది విద్యార్థులను, 25 మంది ఉపాధ్యాయులను, ఇద్దరు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలను, పాఠశాలలకు ఆర్థిక సహాయం చేసిన ఇద్దరు గ్రామస్తులను మెమొంటో,ప్రశంసా పత్రాలతో సన్మానించారు.