# Tags

మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమైన నిందితుడికి 10 సం. జైలు శిక్ష, 11 వేల రూ. జరిమానా విధించిన న్యాయమూర్తి నారాయణ

జగిత్యాల :

-కీలక తీర్పును వెలువరించిన 1st Addl. District & Sessions Judge శ్రీ నారాయణ

-మద్యం సేవించి వాహనం నడపడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్న ఎస్పి అశోక్ కుమార్

వివరాలోనికి వెళ్తే… నిర్మల్ జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన కూనారం సునీల్ తేదీ 13-06- 2022 రోజున సాయంత్రం అతని స్నేహితులైన పల్లికొండ రోహిత్, ప్రవీణ్ తో కలిసి పని నిమిత్తం ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి AP 01AH 4346 అనే బైక్ పై రావడం జరిగింది.

అక్కడ పని ముగించుకుని వెళ్లే క్రమంలో పల్లికొండ రోహిత్ అతిగా మద్యం సేవించి తన స్నేహితులు వద్దన్నా వినకుండా వారిని బైక్ పై ఎక్కించుకొని అజాగ్రత్తగా బైక్ నడపడం జరిగింది.ఈక్రమంలో దోనూరు గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కింద పడగా మధ్యలో కూర్చున్న సునీల్ అనే వ్యక్తి తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటన  గురించి మృతుని యొక్క తండ్రి పోచన్న ఫిర్యాదు మేరకు ధర్మపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా,అప్పటి ఎస్.ఐ కిరణ్ కుమార్ నిందితుడి పై కేసు నమోదు చేసి విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేశారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లేశం తమ వాదనలు వినిపించగా సాక్షులను విచారించిన గౌరవ న్యాయమూర్తి 1st Addl. District & Sessions JudgeS.నారాయణ నిందితుడికి 10 సంవత్సరంలు జైలు శిక్ష, మరియు 11 వేల రూపాయల జరిమాన విధిస్తూ కీలక తీర్పునిచ్చారు.

అలాగే,ఈ ఘటన జరిగినప్పుడు నిందితుడు రోహిత్ కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటంతో లైసెన్స్ లేని వ్యక్తికి బైక్ ఇచ్చినందుకు వాహన యజమాని అయిన పల్లికొండ మల్లేశం కు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

ఈ సందర్బంగా ఎస్పి ఆశోక్ కుమార్ ఒక ప్రకటనలో మద్యం సేవించి వాహనం నడపడాని తీవ్రంగా పరిగణిస్తాo అని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపటం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారనీ, అజాగ్రత్త వలన వాహనం నడిపేవారే  కాకుండా అవతలివారి ప్రాణాలు పోవటానికి కూడా భాద్యులు అవుతున్నారు కావున మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. 

కాగా,ఈ కేసును పకడ్బందీగా విచారణ జరిపి సాక్ష్యాదారాలను, సాక్ష్యులను తగు రీతిలో కొర్టులో ప్రవేశ పెట్టి ,ఇట్టి శిక్ష పడటానిక కృషిచేసిన పీపీ మల్లేశం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్.ఐ కిరణ్ కుమార్ , CMS ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్ మరియు CMS కానిస్టేబుల్ రాజు, కిరణ్ లను అభినందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు.