# Tags
#Blog

కామారెడ్డి జిల్లాలో పట్టుబడిన 137 కిలోల గంజాయి 5 గంజాయి మొక్కలు దహనం

కామారెడ్డి:
వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని కామారెడ్డి జిల్లా ఎస్పి సింధు శర్మ నేతృత్వంలో యస్ ఓ పీ ప్రాకారం బుదవారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు.
కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 137 కిలోల ఎండు గంజాయిని మరియు 5 గంజాయి మొక్కలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి పర్యవేక్షణలో శ్రీ మెడికేర్ సర్వీసెస్ పడకల తండా జక్రాన్ పల్లి మండల్ ప్రాంతంలో నిర్వీర్యం చేశారు.కామారెడ్డి టౌన్ , దేవనుపల్లి, రాజంపేట, గాంధారి, సదాశివనగర్, నసరూళ్ళబాద్, పెద్ద కొడపగల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 15 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్థులను గతంలో అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి తెలిపారు.జిల్లాలో ఠాణాల్లో నిల్వ ఉన్న గంజాయి సరకును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్వీర్యం చేశామన్నారు.కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి, కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వరరావు, డిసిఆర్బి డిఎస్పి మదర్ లాల్, సిఐలు తిరుపయ్య, శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.