#తెలంగాణ #జగిత్యాల

2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

జగిత్యాల:

జిల్లా కేంద్రంలో 2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జిల్లా కేంద్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఆదివారం మధ్యాహ్నం 3గంటల  ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని, 2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టీ. విజయలక్ష్మితో పాటు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీఎం సహాయ నిధి చెక్కుల లబ్ధిదారులు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.

https://public.app/video/sp_ou2ufc3hs9f8p?utm_medium=android&utm_source=share

జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల పట్టణ,  అర్బన్ మరియు రూరల్ మండలాలు, ఇంకా  సారంగపూర్, బీర్పూర్, రాయికల్ మండలాలకు చెందిన 285 మంది లబ్ధిదారులకు మంజూరైన 2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పంపిణీ చేశారు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణ ఏర్పడిన తదుపరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం 90 శాతం ఆరోగ్య సమస్యలు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందవచ్చు ప్రతి ఒక్క నిరుపేద ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోవాలి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.రాబోయే కాలంలో ఇంకా ప్రజా సేవ చేస్తాననీ, ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారు తన దృష్టికి తీసుకు వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం చేయిస్తానన్నారు.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *