2017-2018 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నగదు పురస్కారంతో కూడిన హరితమిత్ర అవార్డులు పొందినవారిని సన్మానించిన మంత్రి
2017-2018 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నగదు పురస్కారంతో కూడిన హరితమిత్ర అవార్డులు పొందినవారిని సన్మానించిన మంత్రి
….తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ శాఖ అధికారి బి.వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్ బతుకమ్మకుంట వద్ద జరిగిన నియోజకవర్గస్థాయి 9 వ విడత హరితహారం కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్, ఆర్డీఓ మాధురి, స్థానిక సర్పంచి రాజేందర్ రెడ్డి, ఎంపిపి కోల జమున శ్రీనివాస్, జడ్పీటిసి మనోహర్ రెడ్డి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 2017-2018 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నగదు పురస్కారంతో కూడిన హరితమిత్ర అవార్డులు పొందిన వారిని మరియు విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, మెమొంటో లను మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత చేతులమీదుగా అందించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆధ్వర్యంలో ఆ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన sacrifice of tree డాక్యుమెంటరీ పలువురిని ఆకట్టుకోగా విద్యార్థులను అభినందించారు.
