# Tags

సన్న రకం వరిధాన్యంకు 500 రూ. బోనస్ అందజేతపై రైతుల హర్షం-ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు

సన్న రకం వరిధాన్యంకు 500 రూ. బోనస్ అందజేతపై రైతుల హర్షం-ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు

-ప్రభుత్వ నిర్ణయంతో సన్నరకం ధాన్యంకు
ఎకరానికి కనీసం 12,500 రూ. అదనపు లాభం అంటున్న రైతులు

-జిల్లా వ్యాప్తంగా రైతుల హర్షం

-జిల్లా సహకార శాఖ ద్వారా రూ. 60 లక్షల విలువగల 2590 క్వింటాల్ల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు: జిల్లా సహకార శాఖ అధికారి సీ హెచ్. మనోజ్ కుమార్

సన్న రకం వరిధాన్యంకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు మద్దతు ధరతోపాటుగా 500 రూ. బోనస్ అందజేయడంపై జిల్లా వ్యాప్తంగా రైతులు పలుచోట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సన్నరకం ధాన్యంకు ఎకరానికి కనీసం 12,500 రూ. అదనపు లాభం కలుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంకు సమీపంలో నిర్వహిస్తున్న పోతారం దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార శాఖ అధికారి సీ హెచ్. మనోజ్ కుమార్ శనివారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో పోతారం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు ఏ . సాగర్ రావుతో కలిసి పరిశీలించారు.

సన్నరకం ధాన్యం పండించిన రైతు రామరావు ను అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న 500 రూ. బోనస్ ను పద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జగిత్యాల జిల్లా సహకార శాఖ ద్వారా 291 వరి దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా సహకార శాఖ అధికారి సీ హెచ్. మనోజ్ కుమార్ తెలిపారు.

కాగా, రూ. 60 లక్షల విలువగల 2590 క్వింటాల్ల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. తమ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచనల మేరకు ఎప్పటికపోకప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, ధాన్యం కొనుగోలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సన్నరకాల వరిధాన్యంకు ప్రభుత్వం అందిస్తున్న 500 రూ. బోనస్ పట్ల రైతులతో పాటుగా ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు ఏ .సాగర్ రావు సైతం హర్షం వ్యక్తం చేస్తూ, సన్నరకాలకు 500 రూ. బోనస్ అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.