#తెలంగాణ

రాత్రి అయిందంటే చాలు…ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనకు తాళం ?

రాత్రి అయిందంటే చాలు…ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనకు తాళం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నకు రాత్రి అయిందంటే చాలు తాళం వేసి ఉంటుందని అత్యవసరంగా.. ఆరోగ్య పరీక్షలకు వెళ్తే.. రాత్రి పూట ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరని ఎల్లారెడ్డిపేట కు చెందిన కొర్రి అశోక్ తెలిపారు.

కనీసం వాచ్ మెన్ కూడా విధుల్లో లేరని… నైట్ డ్యూటీలో ఇటు వైద్యులు లేకపోవడం, అటు వాచ్ మెన్ కూడా లేకపోవడం విడ్డూరంగా ఉందని అశోక్ అన్నారు.ఇక్కడ వైద్యులు లేకపోవడంతో… తప్పనిసరి పరిస్థితుల్లో మండల కేంద్రములోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని అందుబాటులో వైద్యులు కానీ ఎ.ఎన్.ఎం లు కానీ లేకపోవడం సిబ్బంది పనితీరుకు నిదర్శనం అని అన్నారు.

ఇట్టి సంఘటన పై జిల్లా కలెక్టర్ విచారణ జరపాలని అశోక్ తెలిపారు….

బాధితుని పిర్యాదు మేరకు ఆసుపత్రి వైద్యులు డా. బాబును వివరణ కోరగా… వర్షం రావడం,కోతుల బెడద తో డోర్ దగ్గరకు వేశారని,వైద్యులు అందుబాటులో ఉన్నారని,డోర్ కు తాళం వేయలేదని అన్నారు.

విచారణ అనంతరం చర్యలు తీసుకుంటాం అని తెలంగాణ రిపోర్టర్ జిల్లా ప్రతినిధికి వివరించారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *