#తెలంగాణ

అంబరాన్నంటిన 75 వసంతాల వజోత్సవ వేడుకలు-హన్మాజిపేట స్కూల్లో కలుసుకున్న పూర్వ విద్యార్థులు

పూర్వ విద్యార్థుల జన జాతర

1949-2025 వజ్రోత్సవం – మహానందోత్సవం

హన్మాజిపేట ఒడిలో 75 ఏళ్ల బడి పండుగ

  • దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు.
  • ఈ పాఠశాల నుంచి చదివి ఉన్నత స్థానాల్లో..
  • కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్
  • మాజీ జడ్పీ చైర్ పర్సన్ రవీంద్ర గౌడ్ భావోద్వేగ ప్రసంగం

హనుమాజీపేటను సినారె మండలంగా ప్రకటించాలని డిమాండ్

వేములవాడ మండలం హనుమాజీపేట గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల వజ్రోత్సవ 75 వసంతాల వేడుక సంబరాలు అంబరాన్నంటాయి.

పదోతరగతి చదివిన అనంతరం కొన్నేళ్లకు పూర్వ విద్యార్థుuలు ఆత్మీయ సమ్మే శనం జరుపుకోవడం షరా మామూలే. కానీ ఇక్కడ మాత్రం 75 వసంతాల పూర్వ విద్యార్థుల వజ్రోత్సవ వేడుకలు జరుపుకొని సుమారు రెండు వేలకు పైగా పూర్వ విద్యార్థులు ఆనందంలో మునిగి పోయారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ సి. నారాయ ణరెడ్డి గ్రామంలో ఈ వేడుకలు నిర్వహించారు. నెల రోజులుగా 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల కోసం పూర్వ విద్యార్థులు కలవాలనే తపన తో కొంతమంది యువకులు, పూర్వ విద్యార్థుల పట్టుదల,శ్రమ, కళ నేడు నిజమైంది.

సి.నారాయణరెడ్డి ప్రభుత్వ పాఠశాల కోసం మూడెకరాల సొంత స్థలాన్నిచ్చిన ఈ ప్రభుత్వ పాఠశాలలోనే ఈ మూడు తరాల వేడుకలు ముచ్చటగా జరిగాయి. హన్మాజిపేటతో పాటు దాదాపు పది గ్రామాల పూర్వ విద్యార్థినీవి ద్యార్థులు, అప్పటి కొంతమంది అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ముందుగా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని గురువులకు సన్మానం చేశారు. పాఠశాలలో చదువుకున్న పదోతరగతి విద్యార్థుల బృందం పరిచయ కార్యక్రమం నిర్వ హించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

బడిని గుర్తుచేసుకుంటూ పోటాపోటీగా గ్రూప్ ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వజ్రోత్సవాల్లో చిన్నారుల ఆటపాట అందరిని అలరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు కార్యక్రమానికి హాజరు కాలేదు, వారు వజ్రోత్సవ వేడుకల సందర్భంగా సందేశాన్ని పంపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కు అభినందనలు తెలుపుతూ పంపించిన సందేశాన్ని టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా సభకు చదివి వినిపించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949 నుండి 2025 సంవత్సర వరకు 75 బ్యాచ్ ల పూర్వ విద్యార్థులను ఒకే వేదిక పైకి తీసుకురావడం సంతోషకరమన్నారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.

వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి హాజరై నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమం లో పాల్గొన్న పూర్వ విద్యార్థి మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తీగల రవీంద్ర గౌడ్, భావోద్వేగ ప్రసంగం అందరిని ఆకర్షించి…. ఆలోచింపజేసింది.. హనుమాజీపేటలో బాలికల జూనియర్ కళాశాల సినారె పేరు మీద మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ పాఠశాల నుంచి పైస్థానాలకు..

హన్మాజిపేట జెడ్పీ హెచ్ ఎస్ లో చదివి ఎంతోమంది
వివిధ రంగాల్లో రాణించారు. అందులో ప్రధానంగా గ్రామానికి చెందిన స్వర్గీయ రచయిత డా.సి. నారాయణరెడ్డి, శాతవాహన రిటైర్డ్ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ సంకశాల మల్లేశం, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా, సీనియర్ పాత్రికేయులు తాహేర్ పాషా, మరిపెళ్లి ప్రభాకర్, రాజకీయరంగంలో జడ్పీ చైర్మన్ గా వెలుగొందిన తీగల రవీంద్ర గౌడ్, హైకోర్టు న్యాయవాది తీగల రాంప్రసాద్, తోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఈ పాఠశాల విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాల్లో వెలుగొందుతున్నారు.

వజ్రోత్సవాల విజయవంతానికి కృషి చేసిన ఆరు కమిటీలు

75 వసంతాల వజ్రోత్సవ వేడుకల నిర్వహణ కోసం ఆరు కమిటీలను ఏర్పాటు చేశారు. కన్వీనర్ గా జంకే మల్లేశం తో పాటు కమిటీ ముఖ్యులుగా లాయక్ పాషా, మర్రిపెల్లి ప్రభాకర్, కొలిపాక నరసయ్య, రాకేష్ రెడ్డి, శ్రీనివాస్, నర్సయ్య లతోపాటు మరికొంతమందిని ప్రకటించుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ రావు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వజ్రోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిసాయి.
వజ్రోత్సవ వేడుకల సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వహణ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది…. హాజరైన పూర్వ విద్యార్థులకు, అతిథులకు మేమెంటోలు అందజేసి సత్కరించారు.

భోజన సౌకర్యం ఏర్పాటుచేసిన1982 -83 బ్యాచ్

వజ్రోత్సవ వేడుకలకు హాజరైన సుమారు రెండు వేల మంది పూర్వ విద్యార్థులు, అతిథులు, హాజరైన ప్రముఖులకు భోజన ఏర్పాట్లను 1982- 83 ఎస్ఎస్సి బ్యాచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు .వజ్రోత్సవ వేడుకలకు విచ్చేసిన పూర్వ విద్యార్థులకు, అతిథులకు భోజన ఏర్పాట్లు చేసిన 1982-83 బ్యాచ్ కు నిర్వాహకులు, పూర్వ విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమాన్ని లాయక్ పాషా, తాటిపల్లి శ్రీనివాస్, దుర్గం పరశురాం, కొలిపాక శ్రీనివాస్ విజయవంతం చేయగా వారికి బ్యాచ్ సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *