మానవత్వం చాటుకున్న కండ్లపల్లి మాజీ సర్పంచ్ సంపత్
జగిత్యాల నియోజకవర్గం
బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కండ్లపల్లి వైపు మోటార్ సైకిల్ పై ఒక బర్త్ డే పార్టీకి వెళుతుండగా, అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయారు. ఆ సమయంలో అటువైపు నుంచి వెళుతున్న కండ్లపల్లి మాజీ సర్పంచ్ సంపత్ రోడ్డు పక్కన ఎండలో పడి ఉన్న ఇద్దరు యువకులను గమనించి ప్రాథమికంగా చికిత్స అందించి వెంటనే 108 వాహనంకు కాల్ చేసి, వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎండలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని కాపాడి ఆసుపత్రికి పంపిన కండ్లపల్లి మాజీ సర్పంచ్ సంపత్ ను పలువురు గ్రామస్థులు, వారి కుటుంబ సభ్యులు అభినందించారు.