# Tags
#జగిత్యాల

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం ఆనంద నిలయంలో ఇఫ్తార్ విందు 

జగిత్యాల

జగిత్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం ఆనంద నిలయంలో గురువారం రాత్రి ఇఫ్తార్ విందు పేరిట విద్యార్థినిలకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ యాస్మిన్ బాషా పాటు జిల్లా అదన కలెక్టర్లు టిఎస్ దివాకర రాంబాబు తో పాటు జిల్లా అధికారులు రాజ్ కుమార్ సాయిబాబా ఇతర అధికారులు మరియు రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడు ఎండి. వకీల్, టి ఎన్జీవో సంఘ అధ్యక్షుడు బోగ శశిధర్, కార్యదర్శి నాగేందర్ రెడ్డితోపాటు ఇతర అధికారులు, సంఘ సభ్యులు ఎండి హకీమ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా విద్యార్థినిలతో మాట్లాడుతూ మంచి చదువులు చదివి ఉన్నత లక్ష్యం పెంచుకోవాలని సూచించారు.