#లైఫ్‌స్టైల్‌

సమాజ హితాన్ని కోరేది కవులు: పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జి. శ్యాంప్రసాద్ లాల్

సమైక్య సాహితీ- లయన్స్ జిల్లా 320 కరీంనగర్ వారి ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం శ్రీనిధి చిట్ ఫండ్ హాల్ లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జి. శ్యాంప్రసాద్ లాల్ ముఖ్య అతిధిగా పాల్గొని, కరీంనగరుకు చెందిన సముద్రాల వంశీ మోహనాచార్యులు రచించిన దృక్ సిద్ధాంత పంచాంగంను ఆవిష్కరించారు.

అదనపు కలెక్టరు శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ… సమాజహితం కోసం పాటుపడే సాహిత్యంను ఈ వేదికగా వినిపించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రకృతి ప్రకోపించినా శాంతి మంత్రం విన్పించేది కవులేనన్నారు. సమాజంలో వున్న రుగ్మతలు తొలగించడానికి కవులు ఒకవైపు, లయనిజం మరోవైపు కృషి చేయడం జరుగుతుందన్నారు.. కవి వాక్కులెప్పుడూ నిజమవుతాయని అన్నారు.

ఈ కార్యక్రమానికి  సమైక్య సాహితీ అధ్యక్షుడు మాడిశెట్టి గోపాల్, విశిష్ట అతిధిగా హనుమాండ్ల రాజరెడ్డి, ఉప గవర్నర్ కోదండరాం, లయన్ కెప్టెన్ మధుసూధన్ రెడ్డి, కార్యదర్శి కె. ఎస్. అనంతాచార్య, ఎస్.ఆర్.ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ డా|| కలువకుంట రాధాకృష్ణ తదితరులు ప్రసంగించారు. కాండూరి వేంకటేశ్వర్లు పంచాంగ శ్రవణం చేశారు. కవులకు భక్ష్యాలు, ఉగాది పచ్చడి వితరణ చేశారు. కవులందరికీ ప్రశంసా పత్రం అందజేసి, శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో లయన్ సింగమరాజు,  లయన్ రమణారెడ్డి, కవులు బొద్దుల లక్ష్మయ్య, సముద్రాల వేణుగోపాల చార్యులు, విఠలశర్మ, అనిత, హరిప్రియ, శ్రీనివాస్, కిషన్, డా.సుజాత మరియు దాదాపు 100 ముంది కవులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *