# Tags
#టెక్ న్యూస్

పాత్రికేయుడంటే….!

కరీంనగర్ (M.Kanakaiah)

పాత్రికేయుడంటే పైసల కొరకు పని చేసెటోడు కాదు….

ప్రజల కొరకు పని చేసేటోడురా……

ప్రజల సమస్యల పైన ప్రయాణించేటోడురా……

ప్రజల పక్షాన నిలిచే తోడురా……

అన్యాయాన్ని ఎదిరించే వాడురా…..

అక్రమాలకు అడ్డుకట్ట వేసేటోడురా…..

న్యాయాన్ని రక్షించే నాయకుడురా……

ప్రజల వార్తలకై ప్రయాసపడేవాడురా…..

ప్రళయమొచ్చినా, సునామీలొచ్చినా,
భూకంపాలొచ్చినా ,వార్త కొరకు వారదయ్యెటోడురా……

కొండాకోన, వాగు వంక, ఎండా వానలైనా ఎదుర్కొనేటోడురా …..

అడవిలో ఉన్న బాధలను అందరికీ అందించేటోడురా

కడుపులో బాధను కలంతో కాగితంపై వ్రాసేటోడురా…..

నిస్వార్థంతో నిజమైన సేవ చేసే సేవకుడురా …..

అక్షర మాలలల్లే అందాల ఆరాధ్యుడురా…..

ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధ య్యేటోడురా…..

పరుల బాధలను ప్రపంచానికి పరిచయం చేసేటోడురా…..

పస్తులున్నా సరే పత్రికల కొరకు పనిచేసే తత్వవేత్తరా…..

ప్రశ్నించే గొంతుకై,
జన సైన్యమై, నిష్పక్షపాతై,
నిస్వార్థపరుడై ,
నిజమైన సేవకుడై ,
ప్రజల పక్షమై ,
కవితల కర్షకుడై,
సమసమాజ నిర్మాణముకై ,
సాగేటోడురా…..

మా పాత్రికేయ మిత్రులందరికీ అంకితమిస్తూ…..

  • గోనెల సమ్మన్న ముదిరాజ్ .
    కవి ,గాయకులు
    తెలంగాణ ముదిరాజ్ జేఏసీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు