#తెలంగాణ

ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పెళ్లి రోజు వేడుకలు

ఘనంగా మంత్రి పొన్నం పెళ్లి రోజు వేడుకలు
— కాంగ్రెస్ కార్యకర్తల శుభాకాంక్షలు
–కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన అభిమానులు

చిగురుమామిడి : (M.Kanakaiah)

హుస్నాబాద్ శాసనసభ్యులుమరియు రాష్ట్ర రవాణా, బిసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్- మంజుల పెళ్లి రోజును పురస్కరించుకొని ఆదివారం చిగురుమామిడి మండల కేంద్రంలో పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలలో జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై, జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, డిసిసి అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ తో కలిసి కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతం, చిన్న వారి నుండి పెద్ద వారి వరకు వాళ్ళని గౌరవించడమే కాకుండా చాలా ఆప్యాయతగా పలకరించే మంచి మనసున్న ఈ పుణ్య దంపతులు ఇరువురు భగవంతుని ఆశీసులతో కలకాలం నిండునూరేళ్లు, ఆయురారోగ్యాలతోఉండాలని, భగవంతుని ఆశిష్శులతో ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ… పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వేడుకలో పోటు మల్లారెడ్డి, దోమ శ్రీనివాస్ రెడ్డి, బుర్ర శ్రీనివాస్, బెజ్జంకి అంజయ్య, కవ్వంపల్లి సంజీవ్, జిల్లెల్ల రమేష్, పోతర్ల శివాంజనేయులు, గూళ్ళ రాజు, చౌదరి మొండయ్య తదితరులు పాల్గొన్నారు.‌

ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పెళ్లి రోజు వేడుకలు

పాత్రికేయుడంటే….!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *