# Tags
#ఎడ్యుకేషన్ & కెరీర్

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు

విద్యార్థులు రానున్న పోటీపరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి: ప్రిన్సిపాల్

-ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం

విద్యార్థులు రానున్న పోటీపరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి, ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.వై సత్యనారాయణ కోరారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

సోమవారం కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మసురుమ్ సుల్తానా, అకాడమిక్ కోఆర్డినేటర్, అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఏ.జ్యోతిలక్ష్మి, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ డా. అంబాల శంకరయ్య,  ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డా. హర్ జ్యోతికౌర్, వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి చంద్రయ్య,  కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ కే కిరణ్ మై, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి,

ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ పడాల తిరుపతి, రాపర్తి శ్రీనివాస్, గణిత శాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి తాటి స్వరూప రాణి, ఏ రజిని, వి జమున, డి సునీత, శ్రీమతి ఈ జ్యోత్స్న, ఎస్ సత్యం, ఆర్ మాధవి, సంగీత, సాయి, కొండ సంతోష్, గొల్లపల్లి తిరుపతి, సలీం, నరసయ్య, ఎదునూరి నవీన్, రశ్మిత, సురేష్, ఇర్ఫాన్ ఆ బేగం, యాస్మిన్ సుల్తానా, వాలంటీర్లు, విద్యార్థులు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు రానున్న పోటీ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని అన్నారు., అలాగే ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి అనుభవాలను నేర్చుకోవాలని సూచించారు.