#హైదరాబాద్

ఈ స్టేజి మహా  ప్రమాదకరం-నిత్యం ప్రమాదాలు జరుగుతున్న వైనం…

కరీంనగర్: (Reporter:M.Kanakaiah),

ఈ స్టేజి మహా  ప్రమాదకరం
నిత్యం ప్రమాదాలు జరుగుతున్న వైనం

వామ్మో అంటున్న ప్రయాణికులు!
-పట్టించుకోని అధికారులు
!

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని సదాశివ పల్లి స్టేజి నుండి  తీగల బ్రిడ్జి రోడ్డు . వరంగల్ వైపు వెళ్లే రహదారి నిత్యం వాహనాలతో   రద్దీగా ఉంటుంది ఆ స్టేజి నాలుగు మూల నుండి వచ్చే కూడలిలో ప్రయాణిస్తున్న వాహనదారులు  వామ్మో అంటూ ఎప్పుడూ ఏ క్షణం ప్రమాదం జరుగుతుందోనని భయానికి గురవుతున్నారు. 

ఆ స్టేజి దగ్గర ప్రయాణికులు మృతి చెందిన సంఘటన కూడా ఉన్నాయి  అధికారులు ఇప్పటికైనా గుర్తించి స్టేజ్ దగ్గర ఓ సిగ్నల్ ఏర్పాటు చేసి ప్రమాదాలకు అడ్డుకట్ట వెయ్యాలని కోరుతున్నారు.

అనంతారం సదాశివ పల్లి  రైస్ మిల్లు ప్రదేశాలలో విపరీతంగా దుమ్ము రావడంతో ప్రయాణికుల కళ్ళల్లో దుమ్ము చేరుకోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని మండిపడుతున్నారు. ఈ  స్టేజ్ దగ్గర ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుతోపాటు ట్రాఫిక్ పోలీసులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *