# Tags
#తెలంగాణ #జాతీయం #హైదరాబాద్

పెద్దపెల్లి ఎంపీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న వంశీకృష్ణ

పెద్దపెల్లి ఎంపీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న వంశీకృష్ణ

మంత్రి శ్రీధర్ బాబుకు పార్టీ నాయకులకు వంశీకృష్ణ కృతజ్ఞతలు

పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ తనయుడు వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందారు ఈ సందర్భంగా కౌంటింగ్ అనంతరం ఎన్నికల అధికారి వంశీకృష్ణకు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

ఈ సందర్భంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు పాటు ఆయన తండ్రి ఎమ్మెల్యే డాక్టర్ వివేక్, మరియు ఎమ్మెల్యే జి. వినోద్ తోపాటు మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు శశిభూషణ్ కాచే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… తన తాత, దివంగత వెంకటస్వామి చూపిన మార్గదర్శకంలో, ఆయన ఆశీస్సులతో తాను పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి, పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలు తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే తన గెలుపు కోసం అహర్నిశలు కృషిచేసి, ఎంతో బాధ్యతగా తన వెంట ఉండి విజయ బావుటవైపు తనను నడిపించిన రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మరియు పార్టీ నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతూ… పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు.