# Tags
#జగిత్యాల

ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవం-గర్ల్స్ హైస్కూల్ గజిటెడ్ హెచ్ఎం బాలకిషన్ కు సన్మానం

ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవం-పదవి విరమణ పొందిన గజిటెడ్ హెచ్ఎం లకు సన్మానం

జగిత్యాల:

జగిత్యాల వికెబి-ఏసి ఫంక్షన్ హాల్లో జరిగిన “ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవం”లో 2024 మార్చ్ నుండి జూన్ వరకు పదవి విరమణ పొందిన గజిటెడ్ హెచ్ఎం లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో జిజిహెచ్ఎస్ జగిత్యాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గడ్డం బాలకిషన్ ను ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కూర రఘోత్తoరెడ్డి, పిఆర్టియు రాష్ట్ర అధ్యక్ష-ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావులు సన్మానం చేశారు.

అదేవిధంగా జిల్లా అధ్యక్ష- ప్రధాన కార్యదర్శులు యల్ల అమర్నాథ్ రెడ్డి, బోయినపెల్లి ఆనందరావు, సిద్దిపేట జిల్లా అధ్యక్ష- కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, ఆరదాసు శశిధర్ శర్మ, జగిత్యాల అర్బన్ ఎంఈఓ గాయత్రి దేవి, పాఠశాల బృందం- ఎఫ్ఎసి హెచ్ఎం ఏ. రామానుజమ్ తదితరులందరూ సన్మాన గ్రహీతను ఘనంగా శాలువా- మెమొంటోతో సత్కరించినారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వివిధ ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదవ తరగతిలో 10 జీపీఎస్ సాధించిన 37 మంది విద్యార్థులకు, 100% ఫలితాలు సాధించిన 101 మంది ప్రధానోపాధ్యాయులకు సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఎమ్మెల్సీచే, అలాగే పిఆర్టియు రాష్ట్ర, జిల్లా సంఘ బాధ్యులచే సన్మానం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వివిధ మండలాల సంఘ బాధ్యులు, కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.