#తెలంగాణ #హైదరాబాద్

క్షేమంగా యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

క్షేమముగా యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

-తమ ఆసుపత్రిలో చికిత్స, వైద్య సేవలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేసిన ఆసుపత్రి డైరెక్టర్ డా.పవన్ గోరుగంటి

యశోద ఆసుపత్రి డైరెక్టర్ డా.పవన్ గోరుగంటి

ఇటీవల గుండెపోటు లక్షణాలతో అస్వస్థతకు గురైన, రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ  గత మూడు రోజులక్రితం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ప్రాథమికంగా పరీక్షించిన హన్మకొండ కు చెందిన శ్రీమతి డా.స్వరూప,హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యుడు, కార్డియాలజిస్ట్ డా.రఘుకు రెఫర్ చేశారు. ఈ దృష్ట్యా డా.రఘు ఆధ్వర్యంలో వైద్య బృందం రామకృష్ణ కు మూడు స్టెంట్ లు వేయడం జరిగింది. 

అనంతరం ఆసుపత్రిలో కోలుకుని, గురువారం సాయంత్రం యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జి అవుతున్న సందర్భంగా, ఆసుపత్రి డైరెక్టర్ డా.పవన్ గోరుగంటి తన వైద్య బృందం మరియు డా.విజయకుమార్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలకు చెందిన వెంకటేశ్వరరావు, శ్రీమతి సునీతవసంత్ సముద్రాల, శ్రీమతి పద్మ తో పాటు పలువురితో కలిసి, రామకృష్ణకు పుష్పగుచ్చం అందించి, మరింత త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల పని తీరును అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.   

Leave a comment

Your email address will not be published. Required fields are marked *