#తెలంగాణ #హైదరాబాద్

బొగ్గు గనుల వేలంపై..సీఎం రేవంత్​ రెడ్డి సూటిగా, ఘాటుగా!

బొగ్గు గనుల వేలంపై గత ప్రభుత్వం నిర్వాకాన్ని ఎండగడుతూ
సీఎం రేవంత్​ రెడ్డి సూటిగా, ఘాటుగా ఎక్స్​లో స్పందించారు.

కేటీఆర్ గారూ,

పదేండ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను మీరు పట్టించుకోలేదు. కనీసం వినడానికి కూడా ఇష్టపడలేదు. మీరు ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదు. అయినప్పటికీ.. మీలో మార్పు రావాలని కోరుకుంటూ.. ఈ వాస్తవాలను మరోమారు తెలియజేస్తున్నాం.

  1. మన సంస్థల ప్రైవేటీకరణను, మన ప్రజల వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినా, గత కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించినా సరే.. కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులందరూ అడుగడుగునా వ్యతిరేకించారు.
  2. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను మొట్టమొదటి సారి వేలం వేసింది. రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. అరబిందో మరియు అవంతిక అనే రెండు కంపెనీలకు కట్టబెట్టింది మీ ప్రభుత్వ హయాంలోనే. అందుకు సహకరించింది మీ ప్రభుత్వమే. అప్పుడు మీరు, మీ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదు..?
  3. మా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు సింగరేణి గనులను ప్రైవేటీకరించడం మరియు వేలం వేయడాన్ని వ్యతిరేకించారు. మీ ప్రియమైన అవంతిక మరియు అరబిందో కంపెనీలకు మీరు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.
  4. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, వారి ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌తో సురక్షితం. మన బొగ్గు.. మన హక్కు. కాపాడి తీరుతాం. తెలంగాణ ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడుతాం.
  5. అసలు విచిత్రమేమిటంటే.. అటు సింగరేణిని , ఇటు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ను టోకున ప్రైవేటుకు అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *