# Tags
#తెలంగాణ #బిజినెస్ #వ్యవసాయం

మంథనిలో ఎరువులు,పురుగు మందులు,విత్తనాల దుకాణాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

మంథని పట్టణంలో ఎరువులు,పురుగు మందులు,విత్తనాల దుకాణాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

మంథని పట్టణంలో సోమవారం ఉదయం ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి దోమ ఆదిరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ప్రస్తుత సీజన్ లో పంటకాలంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండడంతో పాటుగా,  నకిలీఎరువులు, పురుగు మందులు,విత్తనాలు  లేకుండా,  దుకాణాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు.

ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు గానీ, నకిలీ ఎరువులుగాన్నీ అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆదిరెడ్డి దుకాణాదారులను హెచ్చరించారు.వీరి వెట ఇన్చార్జి  మండల వ్యవసాయ అధికారి మోహన్ తదితరులున్నారు.