#తెలంగాణ #హైదరాబాద్

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి నేరెళ్ల శారద

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు, ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. త్రిమూర్తులకు మూలమైన ఆదిపరాశక్తి స్త్రీ. ప్రకృతిని స్త్రీరూపంగా చెప్పాయి వేదాలు. మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమన్నారు ఋషులు…

కానీ ప్రస్తుత ఆధునాతన పరిస్థితులలో మహిళల పట్ల, బాలికల పట్ల హత్యాచారాలకు ఒడిగడుతున్న ఘటనలు ప్రతి ఒక్కరినీ ఎంతగానో కలచి వేస్తున్నాయి.

ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా తనపై నమ్మకం ఉంచి నియామకం చేసినందుకుగాను పార్టీ అధినేత రాజీవ్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు మంత్రులకూ, పార్టీ నాయకులకు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నేరెళ్ళ శారద కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీమతి నేరెళ్ల శారద మీడియాతో మాట్లాడుతూ… మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మహిళలు, బాలికల సంక్షేమం, భద్రతకు సంబంధించిన కార్యక్రమాలను ఒక ప్రణాళికాబధ్దంగా ముందుకు తీసుకువెళ్లి, సమాజంలో మహిళా శక్తి ప్రాధాన్యత, మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆడపిల్లకు ఆరు నెలలు వచ్చినప్పటినుంచి వస్త్రధారణపైనా, వారిని తీర్చిదిద్దే అంశంలో ఎంతటి ప్రాధాన్యత కల్పిస్తామో…అదేవిధంగా బాలురకు, పురుషులకు కూడా గుణగణాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామన్నారు.

శుభాకాంక్షలు :

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా శ్రీమతి నేరెళ్ళ శారద పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సీతక్క, ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు

మరియు పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు జనగామ నాగరాజు తో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం కన్వీనర్ మంద భీమ్ రెడ్డి తదితరులు, పలువురు ఎమ్మెల్యేలు ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *