# Tags
#స్పోర్ట్స్ #అంతర్జాతీయం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కి తొలి పతకం-షూటింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన మనూ భాకర్

ఎవరీ మను భకర్

ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు.

మనూ భాకర్ హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువతి. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపాల్. మను చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్ లో పాల్గొనేవారు. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ లో 9 బంగారు పతకాలు కొల్లగొట్టారు. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించారు. ఈమె అర్జున అవార్డు గ్రహీత కూడా.భగవద్గీత నుంచి ఎంతో నేర్చుకున్నా: మనూ భాకర్ భగవద్గీత నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని ఒలింపిక్ విజేత మనూ భాకర్ తెలిపారు. పతకం సాధించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఫైనల్ రౌండ్సు ముందు కూడా నేను భగవద్గీత చదివాను. నా ఫోకస్ జరగాల్సిన దానిపైనే. ఫలితం గురించి ఆలోచించలేదు. భగవద్గీత చదివితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ రికార్డు క్రియేట్ చేశారు.