#తెలంగాణ #లైఫ్‌స్టైల్‌

కవి, రచయిత బండారి అంకయ్య గౌడ్ అస్తమయం

బండారి అంకయ్య అనేక కళలలో ప్రవేశమే కాదు, ప్రావీణ్యత గూడా ఉన్నవారు. కవిగా, రచయితగా, నాటకకర్తగా, నటులుగా, దర్శకులుగా, వ్యవహారకర్తగా, సమర్థులైన డిప్యూటీ కలెక్టర్ గా తెలుగు నేలలో భిన్న ప్రాంతాల వారికి సుపరిచితులు.

ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ‘ప్రజలే ప్రభువులు’ నినాదంతో డా॥జయప్రకాశ్ నారాయణ ప్రారంభించిన ‘లోక్ సత్తా’ ఉద్యమంలో చేరి అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రజలకు సన్నిహితులైనారు. ‘లోక్ సత్తా’ రాష్ట్ర కార్యదర్శిగా దేశంలోని అనేక ప్రాంతాల్లో స్థానిక, మహిళా సాధికారత సదస్సులు నిర్వహించిన సమర్థులు.

జనం మధ్యకెళ్ళి వాళ్ళ మనస్సుల గెలిచిన చైతన్య శీలి. స్నేహశీలి, నిరాడంబరులు. ప్రభుత్వ అధికారిగా ఉన్న రోజుల్లో పేద ప్రజలకు తనవల్ల ఐన సహకారం నిస్పంకోచంగా అందించారు. మిత్రులకు వీరు మంచి ‘భరోసా’, కులమత భేదాలకు అతీతులు అభ్యుదయవాది బండారి అంకయ్య.ఆయనకు కరీంనగర్ కవులు, సాహితీవేత్తల నివాళులు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *