# Tags
#ఎడ్యుకేషన్ & కెరీర్ #జగిత్యాల #తెలంగాణ

విద్యార్థులకు ప్రాథమిక దశనుండే వివిధ బాధ్యతల పట్ల అవగాహన, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి: డా. వి. నరేందర్ రెడ్డి

స్పూర్తినింపిన జగిత్యాల కృష్ణ నగర్ అల్ఫోర్స్ క్యాప్టెన్స్ మరియు వైస్ క్యాప్టెన్స్ ప్రమాణ స్వీకారోత్సవం

విద్యార్థులకు వారి విధుల పట్ల చక్కటి అవగాహన కల్పించడమే కాకుండా బాధ్యతలను నిర్వర్తించే విధానాలను తెలియపర్చాలని తద్వారా సమాజంలో అగ్రగామిగా ఉండవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి స్థానిక క్రిష్ణానగర్లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల ప్రాంగణంలో వేడుకగా నిర్వహింపబడిన వివిధ విభాగాల క్యాస్టెన్స్ మరియు వైస్ క్యాప్టెన్స్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… పాఠశాలలో ఇటీవల కాలంలో ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎన్నికలు నిర్వహించడం వలన సంక్షేమం జరుగుతుందని మరియు ప్రజలకు కావల్సిన అవసరాలను సమకూర్చవచ్చునని అభిప్రాయపడ్డారు.

విద్యార్థులకు ప్రాథమిక దశనుండే వివిధ బాధ్యతల పట్ల చక్కటి అవగాహన కల్పించాలని మరియు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికై ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం సైతం రెట్టింపైన ఉత్సాహంతో పాఠశాలలోని వివిధ విభాగాల కెప్టెన్స్ మరియు వైస్ కెప్టెన్లకు ఎన్నికలు, ఎన్నికల వాతావరణం కల్పించే విధంగా నిర్వహించడం కొనసాగిందని చెప్పారు. 

పాఠశాలలోని “తేజన్”, “సరస్”, “ధృవ” మరియు “లక్ష్య” విభాగాలకు బాలబాలికలకు వేరు వేరుగా ఎన్నికల పోటీలను నూతన ఉత్తేజాన్ని నింపడానికై మరియు శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికై ప్రత్యేకంగా సామాజిక స్పృహను కల్పించడానికై ఎన్నికలను  నిర్వహించడం జరిగిందని చెప్పారు.

ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా విద్యార్థులచేత బాధ్యతలను పాఠశాలకు అనుగుణంగా మరియు తోటి విద్యార్థుల్లో సోధర భావం పెంపొందించే విధంగా స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఆదర్శంగా విధులను నిర్వర్తిస్తామని విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు.

ప్రారంభానికి ముందు డా. వి. నరేందర్ రెడ్డి  విద్యార్థులకు నాయకత్వ విశిష్టతను మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధానాలను స్పష్టంగా వివరించారు. పాఠశాలలోని “తేజన్”, “సరస్”, “ధృవ” మరియు “లక్ష్య” విద్యార్థులు నాయకత్వ లక్షణాలను బలపర్చడానికై ప్రత్యేక నాటికను రూపొందించి, ప్రదర్శించారు.

ప్రమాణస్వీకారం ఆనంతరం తోటి విద్యార్థులు ఎన్నికైన వారికి శుభాబినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన విద్యార్థుల వివరాలు: ధృవ హౌస్ లీలా, 9వ తరగతి, లక్ష్యా హౌస్ వి. శివాని, 9వ తరగతి, సరస్ హౌస్ కె.వర్షిని, 9వ తరగతి మరియు తేజన్ హౌస్ ఆర్. మదురాణి, 9వ తరగతి.

వైస్ క్యాప్టెన్స్: ధృవ హౌన్ – సుముక్ తేజ, 8వ తరగతి, లక్ష్యా హౌన్- డి.చంద్ర, 8వ తరగతి, సరస్ హౌస్ కె.సాహితి, 8వ తరగతి మరియు తేజస్ హౌస్ ఆశీర్, 8వ తరగతి.