# Tags
#తెలంగాణ

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా (Sampath P):

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులతో కలిసి పూజా కార్యక్రమలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….

ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని,అందరు తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని కోరారు.

మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా జిల్లా పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం,ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిస్తుందని, పోలీసు శాఖ సూచించనలు సలహాల మేరకు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు,యువత పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఇదేరీతిలో శనివారం నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు, నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ఎస్పీ కోరారు.

పూజా కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్, సిరిసిల్ల టౌన్ సి.ఐ కృష్ణ, తంగలపల్లి ఎస్.ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.