# Tags
#తెలంగాణ

ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్ కు కాళోజీ అవార్డు

ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్ కు కాళోజీ అవార్డు

హైదరాబాద్ :

పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు 2024 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్ ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అవార్డు కింద రూ. 1,01,116 నగదు, జ్జాపిక అందించి శాలువతో సత్కరిస్తారు. కాళోజీ అవార్డుకు ఎంపికైన నలిమెల భాస్కర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.