#తెలంగాణ #జగిత్యాల

“ఆశలు చిగురించు-ఆత్మహత్యలు నివారించు” అనే నినాదంతో మాత శిశు సంరక్షణ కేంద్రం వైద్యశాలలో అవగాహన కార్యక్రమం

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం పురస్కరించుకొని మాత శిశు సంరక్షణ కేంద్రం వైద్యశాలలో అవగాహన కార్యక్రమం
ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం పురస్కరించుకొని ధరూర్ క్యాంపులోని మాత శిశు సంరక్షణ కేంద్రం వైద్యశాల సమావేశం మందిరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా మానసిక వైద్యశాల విభాగం హెచ్ ఓ డి డాక్టర్ ఆకుల విశాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా మాతాశిశు సంరక్షణ వైద్యశాల సూపరింటెండెంట్ డా.రాములు ముఖ్యాతిథిగా పాల్గొనగా, డా.సునీల్, డా.యాకూబ్ హుసేన్,డా.ప్రవీణ్, డా.సాకేత్ రెడ్డి, డా.రవి, డా.ఆశా మౌనికతో పాటుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్ మరియు పలువురు వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం పురస్కరించుకొని, ప్రభుత్వ వైద్య కళాశాల మానసిక వైద్య విభాగం వారు రూపొందించిన కరపత్రాన్ని డా.రాములు చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….”ఆశలు చిగురించు-ఆత్మహత్యలు నివారించు” అనే నినాదంతో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యల దిశవైపు వెళుతున్న విద్యార్థులు, యువత, రైతులు వివిధ వర్గాలవారికి అండగా ఉన్నామన్న భావనను కల్పించాలనీ, తద్వారా వారిలో మానసిక స్థైర్యంను పెంపొందించవచ్చన్నారు.

డబ్ల్యుహెచ్ఓ నివేదిక మేరకు ప్రతి సంవత్సరం 1లక్షా 50 వేల మంది ఆత్మహత్య లకు పాల్పడుతున్నారనీ, వీరిలో దాదాపుగా 25 శాతం మంది విద్యార్థులు ఉండడం విచారకరమన్నారు… 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *