# Tags
#తెలంగాణ

ఎల్లారెడ్డిపేట,గొల్లపల్లి సమస్యలపై ఆది శ్రీనివాస్ కు వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రిపోర్టర్ :(సంపత్ కుమార్ పంజ)
ఎల్లారెడ్డిపేట,గొల్లపల్లి కి చెందిన పలు సమస్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎల్లారెడ్డి పేటలో 1993వ సంవత్సరం లో కిషన్ దాస్ పేట నుండి నంది విగ్రహం వరకు సీసీ రోడ్డు నిర్మించారు.అది పూర్తిగా చెడిపోయింది.రోడ్డు పూర్తిగా చెడిపోయి గతుకులమయంగా మారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇట్టి రొడ్డును తిరిగి సీసీ రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేయాలని, మంగలయ్య కాలువ నుండి పోచమ్మ వరకు 600 మీటర్ల మేర మురికి కాలువ నిర్మాణం చేయాలని,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో రెండు అంగన్ వాడీ కేంద్రాలు నిర్మాణం జరిగి మూత్రశాలలు నిర్మాణం లేక పాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయని మూత్రశాలలు నిర్మాణం జరిగితే ఇక్కడి అంగన్వాడీ కేంద్రాలు హైస్కూల్ కి మార్చి అట్టి ప్రాథమిక పాఠశాల ను గ్రామ మహిళ స్వశక్తి సమావేశ మందిరం కు కేటాయించవచ్చని వినతి పత్రం లో పేర్కొన్నారు. ఆయన వెంట బుచ్చి లింగు సంతోష్ గౌడ్ ఉన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *