# Tags
#తెలంగాణ

బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి

రాజన్న ఆలయంలో సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్..

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ:-

రానున్న బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో వైభవంగా నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. బతుకమ్మ, దేవీ నవరాత్రుల సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయంలోని గెస్ట్ హౌస్ లో గురువారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అధికారులు పక్కా ప్రణాళికతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఈవో వినోద్ రెడ్డిని ఆదేశించారు. ఇక్కడ ఈ ఈ రాజేష్ ,డి ఈ రఘునందన్, స్థానాచారి అప్పల బీమా శంకర్, ఆలయ పండితులు, నెమలికొండ ఉమేష్, చంద్రగిరి శరత్ తదితరులు పాల్గొన్నారు.