# Tags

ఘనంగా ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ పండుగ

ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ పండుగ బుధవారం కన్నుల పండుగగా జరిగింది.
తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను హిందూ సాంప్రదాయం ప్రకారం తంగేడు పూలు, గునుగు, తామర, చామంతి, బంతి వంటి పూలను సేకరించుకొని ఇంటికి తెచ్చి మహిళలు బతుకమ్మలను రంగురంగుల పూలతో చూడు ముచ్చటగా పేర్చి నూతన వస్త్రాలను ధరించి మహిళలు ఎంతో సంబరంగా బతుకమ్మలను కొంది సేపు తమ ఇంటి ముందట అలుకు చల్లి ముగ్గులు వేసి అచ్చట బతుకమ్మను పెట్టి ఊది బత్తిలి వెలిగించి మొక్కులు చెల్లించుకుని బతుకమ్మ ఆట ఆడుతారు అనంతరం వారి వారి వాడలలో ని ప్రధాన కూడళ్ల వద్ద పెట్టి మహిళలు అందరూ కలిసి సామూహికంగా బతుకమ్మ ఆట ఆడుతారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ,,,,బంగారు బతుకమ్మ ఉయ్యాలో ,,,, ఎంగిలి పువ్వు బతుకమ్మ ఉయ్యాలో,,,,,,అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆట ఆడారు, అనంతరం మహిళలు వారికి అందుబాటులో ఉన్న గిద్దచెరువు వద్ద గల బతుకమ్మ ఘాట్ లో నిమజ్జనం చేశారు
అనంతరం మహిళలు ఇంటి వద్ద తయారు చేసుకొనీ వెంట తీసుకుని వెళ్లిన కారపు వంటలను తీపి వంటలను, ఒకరినొకరు వైనాలుగా పంచుకున్నారు , అయితే ఎంగిలి పూల బతుకమ్మను తయారు చేయడానికి ఒకరోజు ముందు రోజే పూలు తెచ్చి నీళ్లలో వేసి ఉంచుతారు. పువ్వులు ఇలా నిద్ర చేయడంతో వీటిని ఎంగిలి పూలు అంటారు. ఇంటి పెద్దలకు పూజించి కొంచెం భోజనం చేసి.. ఇలా తెచ్చిన పువ్వులతో తొలిరోజు గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. భోజనం చేసిన తర్వాత బతుకమ్మను తయారు చేయడం వల్లనే ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెప్పుకుంటారు. తొలి రోజు వేడుకల్లో నువ్వులు, నూకలు, బియ్యంపిండితో తయారు చేసిన వంటలను గౌరమ్మకి నైవేద్యంగా పెడతారు. ఇలా మొదటి రోజు బతుకమ్మను పూజించడం వల్ల మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం