# Tags
#తెలంగాణ

శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శం:జిల్లా ఎస్పీ

(తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా… సంపత్ కుమార్ పంజ….
ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్ళు అర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాణిగా జీవితం గడిపి సప్తబుషుల బోధనల ద్వారా మహర్షి వాల్మీకి గా మారి అధ్బుతమైన రామాయణం గ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకీ అన్నారు.ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతులుగా జీవించి మంచి పేరు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు అనేదానికి వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనం అని అన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి, సూపరింటెండెంట్ లు,సిబ్బంది పాల్గొన్నారు.