# Tags
#తెలంగాణ

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి:ఎస్ఎఫ్ఐ

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా):
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గీతా నగర్ హై స్కూల్లో నరేందర్ అనే కీచక ఉపాధ్యాయుడు విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వెంటనే అతనిపై పోక్సో కేసు నమోదు చేసి ,సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కి కలవడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ గౌరవప్రదమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండీ సమాజానికి మంచి చెడులు నేర్పించాల్సినటువంటి గురువే విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేయడం ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు తీసుకొస్తుందని అన్నారు వెంటనే ఇలాంటి కీచక ఉపాధ్యాయునిపై ఫోక్సో కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఇట్టి విషయాన్ని 15 రోజుల క్రితమే ప్రధానోపాధ్యాయురాలు కి విద్యార్థులు చెప్పిన విషయం బయటకు రాకుండా చేసి విద్యార్థినిలను భయభ్రాంతులకు గురిచేసిన ప్రధానోపాధ్యాయురాలిపై శాఖా పరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో తరచు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని బయటకు వచ్చేటివి కొనైతే బయటకు రానివి చాలా సంఘటనలు జిల్లాలో ఉన్నాయని వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు, షీ టీం పోలీసు అధికారులు, ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి అవగాహన కార్యక్రమాలు చేయాలని అన్నారు ఉపాధ్యాయ వృత్తికి చెడ్డ పేరు తీసుకొస్తున్న ఉపాధ్యాయులపై నిఘా పెట్టాలని అన్నారు
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్, నాయకులు సాయి భరత్, శివ, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి:ఎస్ఎఫ్ఐ