పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా రక్తదాన శిబిరం
జగిత్యాల జిల్లా….
రక్తదానం చేయడానికి అందరు ముందుకు రావాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
– పోలీస్ అమరవీరుల సంస్మరణ లో బాగంగా రక్తదాన శిబిరం
పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేయడానికి పోలీసు అధికారులు మరియు సిబ్బందితో పాటు స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ మెగా రక్తదాన శిబిరం ద్వారా 50 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా ప్రతీ సంవత్సరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాకు నిర్వహిస్తున్నామన్నారు. పోలీస్ అమరవీరులను ఎప్పటికీ మర్చిపోకుండా,నిత్యం గుర్తు చేసుకోవడానికి జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.పోలీసులు చేపడుతున్న ఇట్టి కార్యక్రమాలకు యువత నుండి అనూహ్య స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా తాజాగా శరీరంలోకి కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటామని సూచించారు. కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు..
ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పోలీస్ అదికారులను అభినందించారు.
ఈ కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీ భీం రావ్, డిఎస్పీ రఘు చంధర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ , ఆర్.ఐ వేణు , మరియు ఎస్.ఐ లు, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ మంచాల కృష్ణ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, బ్లడ్ బ్యాంకు ఆర్గనైజర్ కొమురవెల్లి వేణుగోపాల్, బ్లడ్ బ్యాంక్ వైద్యుడు డా. మణిచందర్ , పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.