# Tags

అమరుల త్యాగం అజరామరం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా)

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో భాగంగా వారిని స్మరిస్తూ జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తా నుండి అంబేద్కర్ మీదుగా గాంధీ చౌరస్తా వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళ్ళు అర్పించిన జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగం.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్చించినా పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని,వారి త్యాగాల ఫలితమే నేడు ప్రశాంత వాతవరణం నెలకొందని,ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ వారోత్సవలు నిర్వహిస్తున్నమని అందులో భాగంగా ఈ సంవత్సరం వారిని స్మరిస్తూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, సైకిల్ ,బైక్ ర్యాలీ,2కె రన్, వ్యాసరచన పోటీలు,షార్ట్ ఫిలిమ్స్,ఓపెన్ హౌస్ కార్యక్రమలు నిర్వహించామన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ లు కృష్ణ,మొగిలి, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్.ఐ లు రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నార